మనవార్తలు- పటాన్ చెరు
ఆహారం మనిషి జీవితంలో అత్యంత అవసరం తో పాటు అత్యంత ప్రాధాన్యమైనదని పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు అన్నారు. పటాన్చెరు మండల పరిధి ముత్తంగి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెహఫైల్ బిర్యాని రెస్టారెంట్ ను ప్రారంభించారు .ఈ సందర్భంగా దేవేందర్ రాజు మాట్లాడుతూ భోజనంలో నాణ్యత పాటిస్తూ అందరి మన్ననలను పొందాలని సూచించారు. ఇది కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా సేవా కోణంలో కూడా చూడాలన్నారు. వ్యాపారంలో నాణ్యత ప్రధానమైనదని, అందులో ఎక్కడా రాజీ పడకూడదు అన్నారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని, అతని బృందం దేవేందర్ రాజును శాలువాతో ఘనంగా సన్మానించారు.