సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జై మల్లికార్జున్
మనవార్తలు- పటాన్ చెరు
ప్రభుత్వ రంగ సంస్థలు,ఇతర సంస్థల ప్రైవేటీకరణ విధానాలను ఐక్యంగా తిప్పి కొట్టాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్ అన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో బాగంగా బుధవారం పటాన్ చెరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ జాతీయ రహదారులను ప్రైవేట్ శక్తులకు నేషనల్ మాని రైజ్ పైప్ లైన్ పేరుతో లీజుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.ఇప్పటికే హైదరాబాద్, బెంగళూర్ జాతీయ రహదారులను ప్రైవేట్ సంస్థలకు కు ఇచ్చారని అన్నారు.రైల్వే రంగంలో 400స్టేషన్లను ప్రైవేట్ వారికి ఇచ్చారని ఆయన అన్నారు.విమాన రంగంలో ఎయిర్ ఇండియా సంస్థ ను టాటా వారికి కట్టబెట్టారని అన్నారు.
టోల్ గేట్ ల వద్ద కార్మికులు లేకుండా ఫాస్ట్ టాగ్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని,ఇది కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వుందన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం మతాని ప్రజల్లో రెచ్చ గొడుతు,ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు.పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర లు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు.రాబోయే కాలంలో అంతా ప్రైవేట్ అవుతుందని ప్రస్తుత పరిస్థితు లు చూస్తే అర్టం అవుతుందని అన్నారు.ప్రభుత్వ రంగం పూర్తిగా ప్రైవేటు మయం అవుతుందని అన్నారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వాజిద్ అలీ,పాండురంగా రెడ్డి, నర్సింహారెడ్డి,నాయకులు నాగేశ్వర్రావు,ప్రసాద్,పల్లంరాజు,అర్జున్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు