శేరిలింగంపల్లి
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల నల్లగండ్ల గ్రామంలో ఉన్న సోమేశ్వరాలయాన్ని ప్రముఖ సంఘసేవకుడు ఎన్టీఆర్, సోఫాకాలని అధ్యక్షులు విట్ఠల్ కుటుంబ సభ్యుల ఆర్ధిక సహకారం నూతనంగా నిర్మించిన కార్యాలయాన్ని సోమవారం రోజు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గాంధీ, ష్టానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి లు ఆలయ కమిటీ చైర్మన్ చెన్నం రాజు ముదిరాజ్, కమిటి సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు .
దేవాలయం అభివృద్ధి కి విఠల్ వంటి దాతలు ముందుకు రావడం అభినందనీయమని, నా వంతు సహాయంగా ఏది చేయడానికైనా సిద్ధమని తెలిపారు. అనంతరం గచ్చిబౌలి కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నరేందర్ గౌడ్, కమిటీ సభ్యులు వసంత్ కుమార్ యాదవ్, యాదగిరి, రవీందర్, రమేష్, రాధ కృష్ణ, నాయకులు శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, రాజు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, దారుగు పల్లి నరేష్, మల్లిఖార్జున శర్మ, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భవన నిర్మాణ దాత విఠల్ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు.