పాశమైలారం లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

Districts politics Telangana

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ
ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం లో గ్రామ ఉపసర్పంచ్ మోటే కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని మధు ప్రియ ఆలపించిన పాటలు అందరినీ ఉత్సాహపరిచాయి.

అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రపంచంలో పూల ను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలలో బతుకమ్మ పండుగను నిర్వహించడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ పండుగ విశ్వవ్యాపితం అవుతోందన్నారు.

ప్రభుత్వం సూచించిన కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోచయ్య, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *