నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో చీరల పంపిణీ
అమీన్పూర్
పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఐదో రోజు అమీన్ పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, సుల్తాన్పూర్ గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రాబోయే తరాలకు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అత్యంత నాణ్యమైన వస్త్రంతో బతుకమ్మ చీరలను తయారు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచులు కురుమ నరసమ్మ, మల్లేష్, తహసిల్దార్ విజయ్ కుమార్, ఎంపిడిఓ మల్లేశ్వర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్నం రాజు, దండే సత్యనారాయణ, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.