మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు పెడుతుందని_మొహ్మద్ జవాద్ అహ్మద్

Districts Telangana

 ఖమ్మం

ఖమ్మం ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి ముస్లిం మతాపెద్దలతో సహా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరై ప్రసంగించారు. మొహ్మద్ జవాద్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సభలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు పెడుతుందని ప్రత్యేకంగా ముస్లింల పట్ల వివక్షత చూపిస్తూ పాలన సాగిస్తుందని.ఆరోపించారు.ఇటీవల అస్సాంలో జరిగిన సంఘటన యావత్ ప్రపంచం చూసింది. అక్కడ గళం విప్పి మాట్లాడిన ముస్లిం మేధావి మౌలానా ఖెలీక్ సిద్దిక్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విభజించి పాలించు అనే సూత్రాన్ని బిజెపి ప్రభుత్వం అక్షరాల పాటిస్తుందని అన్నారు. స్వతంత్ర భారత్లో అందరికి సమాన హక్కులు కల్పించబడ్డాయని.వర్గాలుగా చేయటం మంచి పద్ధతి కాదన్నారు. చట్టాలు తెచ్చి రైతులిబ్బంది కలిగిస్తున్నారని.వారిపైనే దౌర్జన్యం చేస్తున్నారని ఇది ప్రజా క్షేమం కాదన్నారు.మతపెద్దలు మాట్లాడుతూ దేశంలో ఏ వర్గాన్ని అన్యాయం జరిగినా మేము వారి పట్ల గళం విప్పి అన్యాయాన్ని వ్యతిరేకిస్తామని అన్నారు.

మాటపెద్దలపైన జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని హెచ్చరించారు.సభలో పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు ముక్త కంఠంతో జరుగుతున్న దౌర్ర్జన్యాలను ఖండిస్తూ మాట్లదారు. భారీగా జరిగిన కార్యక్రమంలోమౌలాన సయీద్ అహ్మద్ ఖాస్మి.మౌలానా అబ్దుల్ గాని.మౌలానా ముజీబ్.యండి .అబ్రార్.అబ్దుల్ రావూఫ్ ఖాన్.నాయకులు భాగం హేమంతారావు. దుర్గాప్రసాద్. శ్రీనివాసరావు.సీతయ్య. భాస్కరరావు.ఖదీర్.పాషా. ఖాలక్.ఇమ్రాన్. ఆశిష్.అజీజ్ తదితరులు పాల్గొన్నారు.సంఘీభావంగా ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

 ఖమ్మం,ముస్లిం ,మొహ్మద్ జవాద్,మొహ్మద్ జవాద్,బిజెపి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *