ఖమ్మం :
హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఆర్యవైశ్య అభ్యర్ధులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్య సంఘాల వేదిక అధ్యక్షులు బుస్సా శ్రీనివాస్ గుప్తా పిలుపునిచ్చారని వైశ్య సమాజ సేవకుడు మరియు సాదనారత్నo , వైరా పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య ఐక్యవేదిక సంఘాల రాష్ట్ర కార్యదర్శి వెంపటి రంగారావు ఒక ప్రకటనలో తెలిపారు .
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటును చెయ్యకుండా మరియు ఇవ్వకుండా మోసం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఆర్యవైశ్య అభ్యర్థులందరూ ఒక తాటిమీదకొచ్చి ఒకే మాట ఒకే బాటగా అనుసరించి ఆర్యవైశ్యులు ఎవ్వరూ నిల్చున్న వారిని గెలిపించుకుని ఆర్యవైశ్య కార్పోరేషన్ కు కృషి చేయాలని కోరారు . అయితే హుజూరాబాద్ ఎలక్షన్ లో తాను పోటీ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడని ఆర్య వైశ్య సోదర సోదరీమణులందరూ సపోర్ట్ చేయాలని బహిరంగంగా విజ్ఞప్తి చేశారు .
