విజయవాడ :
బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ శాసన సభ్యురాలు పి.ఎమ్ కమలమ్మ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కమలమ్మను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 10గంటలకు బద్వేలు లో నామినేషన్ దాఖలు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.సాకే శైలజనాథ్ మరియు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొంటారు.