జిన్నారం
జిన్నారం మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ ప్రవీణ్ గౌడ్ కి సంతాపం తెలిపారు .ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి,రెండు నిమిషాలు మౌనం పాటించారు .అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు ఇటీవల కాలంలో ఆర్ధిక ఇబ్బందులు అధికమాయ్యాయని అన్నారు. యాజమాన్యాలు సైతం గ్రామీణ విలేకరుల ను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామీణ విలేకరుల సమస్యలపై కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ రమేష్, జర్నలిస్ట్ లు సత్యనారాయణ, మహేష్, నగేష్, కృష్ణ, సాయికుమార్, మహేందర్, నాగభూషణం, సత్యం, మున్ని శ్రీనివాస్, మహేందర్ గౌడ్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.