పటాన్చెరు
రుద్రారం గ్రామంలోని గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సియా లైఫ్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ వారి సహకారంతో నేడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు .అనంతరం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన సియా లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి యజమానికి మరియు డాక్టర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారి వైద్య పరికరాలతో వచ్చి గ్రామం మొత్తం ఉచిత వైద్యం చేసి మరియు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి వైద్యానికి తగు మందులు ఇచ్చే పూర్తి సహకారం అందించిన సియా లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారికి ప్రత్యేక వందనాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉపసర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు సందీప్ గౌడ్, వంశీ, శ్రీనివాస్, పావని శ్రీనివాస్ , సుమలత రాజిరెడ్డి, మరియు సియా లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ప్రదీప్, అబ్దుల్, మరియు వైద్య బృందం, గ్రామ ప్రజలు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.