పటాన్చెరు
విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే ఛాంపియన్షిప్ కరాటే పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపిపి యాదగిరి యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేశ్, కార్యక్రమ నిర్వాహకులు రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు మండలం ఐనోల్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గ్రామ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచ్ శంకర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోచారం గ్రామ శివారులో ఫార్మేషన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
