రామచంద్రపురం
తెలంగాణలో మహిళలందరూ ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఆడపడుచు సంతోషంగా ఉండాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం రామచంద్రాపురం, భారతి నగర్ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆడపడుచులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని అన్నారు. నాణ్యతతో కూడిన చీరలను అందించడం పట్ల మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేయకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. రాజకీయంగా సామాజికంగా ఆర్ధికంగా పారిశ్రామికంగా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు . ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరులో..
పటాన్చెరు డివిజన్ పరిధిలోని రామ్ మందిర్ రోడ్డు లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, తహసిల్దార్ మహిపాల్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.