గీతమ్ లో ఘనంగా గాంధీ జయంతి….

Hyderabad politics Telangana

పటాన్ చెరు:

జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి ఉత్సవాలను గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో శనివారం ఘనంగా నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ( ఇంజనీరింగ్ ) ప్రొఫెసర్ వీకే మిట్టల్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ , ఆర్కిటెక్చర్ , ఫార్మశీ ప్రిన్సిపాళ్ళు ప్రొఫెసర్ జీఏ రామారావు , ప్రొఫెసర్ సునీల్ కుమార్ , ప్రొఫెసర్ జీఎస్ కుమార్ , బీ – స్కూల్ ప్రొఫెసర్ ఏ.శ్రీరామ్ తదితరులు గాంధీ స్క్వేర్ లో నెలకొల్పిన మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , సత్యం , శాంతి , అహింసలకు గాంధీజీ ప్రాధాన్యం ఇచ్చి , ప్రపంచానికే మార్గదర్శకునిగా మారారని కొనియాడారు . గాంధీ త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు . గాంధీ మార్గాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నామని , మనమంతా అదే మార్గంలో పయనించాలని , అదే జాతిపితకు మనమిచ్చే అసలైన నివాళని వారు అభిప్రాయపడ్డారు . మహాత్మా గాంధీకి పలువురు విభాగాధిపతులు , అధికారులు , అధ్యాపకులు , సిబ్బంది తదితరులు కూడా నివాళి అర్పించారు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *