289 వర్ణాల్లో బతుకమ్మ చీరలు

Districts politics Telangana

★ అక్టోబరు 2 నుంచి
పంపిణీకి ప్రభుత్వ సన్నాహాలు

తెలంగాణలో వచ్చే నెల 6 నుంచి జరగనున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా ఇచ్చే చీరలు మంగళవారానికి అన్ని జిల్లాలకు చేరాయి. సిరిసిల్లలో తయారు చేసిన కోటి చీరలను రెండో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు కలె క్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 31 జిల్లాల్లో స్పష్టత వచ్చినా.. హుజూరాబా లో ఉప ఎన్నిక దృష్ట్యా కరీంనగర్, హను మకొండ జిల్లాల్లో పంపిణీపై సందిగ్ధత నెల కొంది. ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన అనంతరం ఈ రెండు జిల్లాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏటా రూ.300 కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాది రూ.318 కోట్లను వెచ్చించింది.

సరికొత్తగా…
—————–
దాదాపు 18 వేల మగ్గాలపై పది వేల నేత కుటుంబాలు ఆరు నెలల పాటు శ్రమించి చీర లను తయారు చేశాయి. గతేడాది పంపిణీ సంద ర్భంగా మహిళల నుంచి అభిప్రాయాలను సేక రించిన అనంతరం మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ సారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్గాలలో రూపొం దించారు. డాబీ అంచు ఈ సారి మరింత ప్రత్యే కతను తీసుకురానుంది. చీరల ప్యాకింగునూ ఆకర్షణీయంగా చేశారు.

పంపిణీ ఇలా…
————————
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పురపాలక వార్డులు, నగరపాలక డివిజన్ల వారీగా రేషన్ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో రేషన్ డీలర్, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీ.. పట్ట ణాలు, నగరాల్లో రేషన్ డీలర్, పురపాలిక బిల్ కలెక్టర్, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. ఆహార భద్రత కార్డులతో వచ్చి లబ్దిదారులు చీరలు పొందవచ్చు. ఈ సందర్భంగా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరనీ.. కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *