సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర… ఎమ్మెల్యే

politics

పటాన్ చెరు:

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఎమ్మెల్యే జిఎంఆర్ సౌజన్యంతో నియోజకవర్గ స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తాను ఎంపీటీసీగా గెలుపొందినప్పటినుండి నేటి వరకు ఉపాధ్యాయుల తో సత్సంబంధాలు నెలకొల్పుతూ, అభివృద్ధిలో వారి సలహాలు సూచనలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నియోజకవర్గస్థాయి లోని ఉపాధ్యాయులు అందరిని ఒక చోట చేర్చి, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. తల్లిదండ్రులు బిడ్డకు జన్మనిస్తే, ఆ బిడ్డకు మంచి భవిష్యత్తును ఇచ్చేది ఉపాధ్యాయులే అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో గురుపూజోత్సవం ఏర్పాటుచేసి ఉపాధ్యాయులను గౌరవించడం పట్ల ఎమ్మెల్యే జిఎంఆర్ ను అభినందించారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఇందుకు ఉదాహరణ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో స్థాయికి మించి అడ్మిషన్లు కావడమే అన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి యాదమ్మ, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకటరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇక చదవండి

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కక్ష సాధింపు

289 వర్ణాల్లో బతుకమ్మ చీరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *