మునిపల్లి
యాసంగి పంటసాగులో పంట మార్పు చేపట్టాలని రాయికోడ్ ఎడిఏ హరిత రైతులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన మునిపల్లి రైతు వేదికలో మునిపల్లి క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ రైతులు ఎల్లప్పుడూ ఒకే రకమైన పంట సాగు చేయకుండా పలు రకాల పంటలు పండించలన్నారు. నీటి ఆధారిత పంటలను పండించేందుకు ఆసక్తి కనబరిచి పప్పు దినుసులు, నూనె గింజలు తదితర పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పంటలను సాగు చేయడం వలన మిశ్రమ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏవో శివకుమార్,ఏఈఓ సంగీత,సర్పంచ్ రమేశ్, ఉప సర్పంచ్ సలవోదిన్ , టిఆర్ఎస్ నాయకులు గారిబోధిన్ తదితరులు ఉన్నారు.