బొల్లారంలోని 8 వార్డులో వంద శాతం కోవిద్ 19 వ్యాక్సినేషన్‌ డ్రైవ్ పూర్తి

Hyderabad politics Telangana

బొల్లారం

బొల్లారం పురపాలక సంఘంలోని కోవిద్ వాక్సినేషన్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించారు. బొల్లారంలోని 8 వ వార్డులో 18 సెప్టెంబర్2021 నాటికి వంద శాతం వాక్సినేషన్ డ్రైవ్‌ పూర్తయింది. వంద శాతం వాక్సినేషన్ డ్రైవ్ పూర్తి చేసుకున్న సర్టిఫికేట్‌ను 8 వార్డు కౌన్సిలర్ చైర్ పర్సన్ కొలాన్ రోజా బాల్ రెడ్డికి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ , పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధిక చేతుల మీదుగా అందించారు .కోవిద్ 19 మొదటి ,రెండవ విడత వాక్సిన్ వేయించుకున్న 8 వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ ఛైర్ పర్సన్ కొలాన్ రోజా బాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు .

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా.. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలన్నారు .కోవిద్ థర్డ్ వేవ్ వచ్చినా వాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవన్నారు .. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మొదటి , రెండవ విడత వాక్సినేషన్ ప్రక్రియకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని కొలాన్ రోజా బాల్ రెడ్డి అన్నారు .

 

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఆర్‌ఓ శ్రీధర్ , హెచ్‌ఈఓ వెంకటరమణ, శానిటేషన్ ఇన్సెక్టర్ వినోద్, PHN స్వరూప రాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *