నియోజకవర్గ వ్యాప్తంగా జన్మదిన సంబరాలు
పటాన్చెరు
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 58 వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరుతో పాటు అమీన్పూర్, తెల్లాపూర్, రామచంద్రపురం, భారతి నగర్, బొల్లారం జిన్నారం, గుమ్మడిదల, బండ్లగూడ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. దేవాలయాల్లో పూజలు మసీదులు, చర్చిలలో ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుండి ఎమ్మెల్యే నివాసం అభిమానుల కోలాహలం తో నిండిపోయింది. నియోజకవర్గంతో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
తనపై ఎంతో అభిమానంతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అందరి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకత్వంలో, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సలహాలు సూచనలతో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా 11 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు అందజేత
ఎమ్మెల్యే జిఎంఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని జీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహిస్తున్న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా ద్విచక్ర వాహనాలను అందజేశారు. జి ఎం ఆర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ, కుటుంబ సభ్యులు గూడెం మధుసూదన్ రెడ్డి, గూడెం కల్పనా మధుసూదన్ రెడ్డి, గూడెం విష్ణువర్ధన్ రెడ్డి, గూడెం విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు పట్టణంలో..
పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి అఫ్జల్ ఆధ్వర్యంలో పటాన్చెరువు పట్టణంలో ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు పట్టణంలోని చైతన్య నగర్ మహా దేవుని ఆలయంలో రుద్రాభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పంచముఖ హనుమాన్ దేవాలయం, మహంకాళి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అల్పాహార వితరణ కార్యక్రమం లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని హజ్రత్ సయ్యద్ నిజాముద్దీన్ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక చాదర్ సమర్పించారు. పార్టీ పట్టణ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జన్మదిన కార్యక్రమం లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
బొల్లారంలో..
బొల్లారం మున్సిపాలిటీ లో ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్ చంద్రా రెడ్డి ఆధ్వర్యంలో 50 అడుగుల గజమాలతో ఎమ్మెల్యే జిఎంఆర్ ను సత్కరించారు.
టిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో..
టిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు మండల యువజన విభాగం నాయకులు సందీప్ ఆధ్వర్యంలో పెద్దకంజర్ల లోని అక్షయ అనాధ ఆశ్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట రెడ్డి లు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి చిన్నారులకు కానుకలు అందజేశారు.జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, జెడ్ పి టి సి లు సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, సుధాకర్ రెడ్డి, ఎంపీపీలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, పార్టీ పట్టణ, మండల, డివిజన్ అధ్యక్షులు, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వివిధ కమిటీల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేశారు.