వడక్ పల్లి లో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అమీన్పూర్
వచ్చే ఆరు నెలల్లో నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శనివారం అమిన్ పూర్ మండల పరిధిలోని వడక్ పల్లి గ్రామంలో లక్షన్నర రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన పది సీసీ కెమెరాలను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం తోపాటు గ్రామం మొత్తం నిఘా నేత్రం లో ఉంటుందని అన్నారు.
అందరి సహాయ సహకారాలతో వచ్చే ఆరు నెలల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు. మినీ ఇండియాగా పోవడం జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 29 రాష్ట్రాల ప్రజలు నివసిస్తూ ఉంటారని అన్నారు.
యువత పెడదోవ పట్టకుండా పోలీసులతో పాటు గ్రామ పెద్దలు కృషి చేయాలని సూచించారు. డిఎస్పి భీమ్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహాయ సహకారాలతో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లలితా మల్లేష్, సిఐ శ్రీనివాసులు రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, గ్రామ పెద్దలు రాంరెడ్డి, పాలక వర్గం సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read :