పటాన్చెరు
పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామ పరిధిలోని ములిగొలిలో ఏర్పాటుచేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల్లో దైవ భక్తిని పెంపొందించేలా నూతన దేవాలయాన్ని నిర్మించడం సంతోషకరమన్నారు.నియోజవర్గంలోని ప్రతి గ్రామంలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు వెంకట్ రెడ్డి, నారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

