పటాన్ చెరు:
పటాన్ చెరు పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తబృందం అధ్యక్షులు సీసాల రాజు 17వ తిరుమల తిరుపతి పాదయాత్రను శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు.
శుక్రవారం ఉదయం పట్టణంలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆనంతరం 11 మందితో కూడిన భక్త బృందం 17 వ పాదయాత్ర ప్రారంభమైంది. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ….వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కరోనా మహమ్మారి తగ్గాలని – సీసాల రాజు
కరోనా మహమ్మారి తగ్గి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు బాగుండాలని ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర భక్తబృందం అధ్యక్షులు సీసాల రాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాణిక్యం, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.