శేరిలింగంపల్లి:
బిసి బంద్ పేరుతో ప్రతీ కుటుంబానికి పది లక్షలు ఇస్తేనే బిసిల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు భేరి రాంచందర్ యాదవ్ అన్నారు. మంగళవారం రోజు శేరిలింగంపల్లి ఎమ్మార్వో కార్యాలయంలో బిసి బంద్ ప్రకటించాలని కోరుతూ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్, సంగారెడ్డి జిలా యూత్ విభాగం అధ్యక్షుడు గణేష్ యాదవ్, వనపర్తి ఉప సర్పంచ్ ఈ. లక్ష్మణ్ యాదవ్, చందు యాదవ్ లతో కల్సి డిప్యూటీ ఎలక్షన్ అధికారి మణిపాల్ కు వినతిపత్రం సమర్పించారు. వెనుకబడిన బిసిలందరికి బిసి బంద్ అమలయ్యేలా కేసీఆర్ చొరవ తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్ని కులాల వారిని సమానంగా చూడాలని, పక్షపాత ధోరణితో ముఖ్యమంత్రి వ్యవహరించకూడదని నర్సింలు ముదిరాజ్, గణేష్ యాదవ్ లు కోరారు.