హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

Hyderabad politics Telangana

పటాన్చెరు

పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించిన్నప్పుడే వాతావరణంలో సమతుల్యత సాధ్యమవుతుందని అన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం తో పాటు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేశ్, అశోక్, షకీల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *