తెల్లపూర్ :
శుక్రవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని తెల్లాపూర్, కొల్లూరు వార్డులలో కోటి పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులకు శాసనమండలి ప్రోటెమ్ చైర్మన్ వి. భూపాల్ రెడ్డి,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు.అనంతరం మీడియాతో ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రములో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రములో అమలు కావడంలేదని ఆయన చెప్పారు. గత 7 సంవత్సరాల్లో పఠాన్ చెరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి తెలిపారు.ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ” పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.