పటాన్ చెరు
పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ పరిధిలోని మంగళవారం రోజు జాతీయ రహదారి పక్కన నిర్మాణాలను తొలగించడం సరియైంది కాదని, మా సొంత పట్టా భూముల్లోనే నిర్మాణాలు చేపట్టామని బాధితులు ముత్తంగి గ్రామానికి చెందిన గడ్డ యాదయ్య, పుణ్యవతి తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మా పెద్దలు సంపాదించిన పట్టా భూమి ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 528 లో కొన్ని షాపులు నిర్మాణాలు చేపట్టామని అన్నారు. వీటి పైన కోర్టులో విచారణ నడుస్తున్నాయని తెలిపారు. గురువారం కూడా కోర్టులో ఇయరింగ్ ఉందని పేర్కొన్నారు.
వీటన్నింటికీ పట్టించుకోకుండా పంచాయతీరాజ్ అధికారులు మా సొంత నిర్మాణాలను కూల్చివేయడం దుర్మార్గమని ఆరోపించారు. మా సొంత స్థలం పక్కనే ఉన్న రవీందర్ రెడ్డి అధికారులకు మ్యానేజ్ చేసి మాపై ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై కోర్టులోనే తేల్చుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డ సుదర్శిని, అనంతయ్య, రత్నమ్మ, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.