పటాన్ చెరు:
కోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి పక్కన గల అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం కోర్టు ఉత్తర్వుల మేరకు డీఎల్పిఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బారి పోలీసు బంధబస్తు మధ్య కూల్చివేస్తున్న పంచాయతీ సిబ్బంది కూల్చివేశారు.
ఈ సంధర్బంగా డీఎల్పీఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 523, 522, 588 లో గల అక్రమ నిర్మాణాలను హై కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్నామని అన్నారు. ఈ నిర్మాణాలకు ఎన్నో సార్లు నోటీసులు జారీ చేసిన కూడా ఎలాంటి రిప్లై ఇవ్వలేదని, 7901 కేసు నెంబర్ ఇచ్చిన తీర్పు ఎందుకు అమలు చేయట్లేదని గ్రామ పంచాయతీ పై కంటేప్ట్ కేసు కుడా అయ్యిందని తెలిపారు.
067 జీవో ప్రకారం హైకోర్టు ఆదేశాల మేరకు 10 జేసీబీలతో 20 ట్రాక్టర్ల సహాయంతో బారి బందోబస్తుతో కూల్చివేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రహదారి పైన ఉన్న మిగతా నిర్మాణాలకు కూడా నోటీసులు జారీ చేసి వాటిని కూడా కూల్చివేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.