పటాన్ చెరు
ఆశా వర్కర్ల కు పి ఆర్ సి అమలు చేసి,కనీస వేతనం 21వేల రూపాయలు పెంచాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు పిఆర్సి అమలుచేసి కనీస వేతనం 21 వేలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని భానూర్ పి హెచ్ సి సెంటర్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆశా వర్కర్ల కు 11 వ పి అర్ సి ప్రకారం వేతనాలు పెంచి,వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆశా వర్కర్ల కు పీఆర్సీ అమలు చేస్తున్నామని ప్రకటించిన దని అన్నారు.4నెలలు గడిచినా నేటికీ చెల్లించ లేదని మండిపడ్డారు.కనీస వేతనం 21వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న,ఆశా వర్కర్ల ను రెగ్యులర్ చేయడం లేదని అన్నారు.రెగ్యులర్ చేయాలని అన్నారు.ప్రస్తుతం వచ్చే వేతనాలు 7500/-రూపాయిలు సరిపోవడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశావర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఆశ వర్కర్లు లక్ష్మి, మాధవి, భాగ్య, లక్ష్మి ఇతరులు పాల్గోన్నారు.