పటాన్చెరు
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తూ ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి పట్టణంలోని గోకుల్ నగర్, సరాయి, రాఘవేంద్ర కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం విషయంలో ప్రజలు బల్దియా సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. రక్షిత మంచినీరును వృధా చేయకూడదని కోరారు, తడి చెత్తను , పొడిచెత్తను , వేరుచేయాలనీ ఈ వర్షాకాలం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని మహిపాల్ రెడ్డి తెలిపారు .ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, ఆయా కాలనీల వాసులు పాల్గొన్నారు.
