108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గర్భిణీ ని ఆసుప్రతికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమై 108 అంబులె‌న్స్‌లో ప్రసవించింది. పూర్తి వివరాల్లోకెళితే బొల్లారం చెందిన తస్లీమ్ బేగం నెలలు నిండడంతో ప్రసవం కోసం ఆదివారం సాయంత్రం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. కాగా బేబీ బరువు ఎక్కువ ఉండటంతో సోమవారం ఉదయం 108 అంబులెన్సులో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మద్యంలో పటాన్‌చెరు మండలంలోని రుద్రారం శివారు జాతీయ రహదారిపై వెళ్తుండగా పురిటి నొప్పులు అధికమయ్యాయి. దాంతో ఇఆర్సిపి డాక్టర్ కాశిరెడ్డి సూచనల మేరకు ఈఎంటి ప్రశాంత్ కుమార్ సహజ ప్రసవం చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సందర్భంగా తస్లీమ్ బేగం కుటుంబ సభ్యులు పైలెట్ పండరి, ఈఎంటి ప్రశాం‌త్‌కు ధన్యవాదాలు తెలి‌పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *