రామచంద్రపురం లో
రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రామచంద్ర రెడ్డి నగర్ కాలనీ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన హరితహారంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్ తో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అంజయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు పరమేష్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
భారతి నగర్ డివిజన్ పరిధిలో
భారతి నగర్ డివిజన్ పరిధిలోని మ్యాక్స్ సొసైటీలో లో ఏర్పాటు చేసిన హరితహారం లో స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.