పటాన్ చెరు
ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరిత తెలంగాణ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని నియోజకవర్గం వ్యాప్తంగా నిర్వహించిన ముక్కొటి వృక్షార్చానలో భాగంగా శాసనమండలి ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అభివృద్ధిలో విప్లవాత్మక మార్పు తీసుకుని వస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మారుస్తున్నారని అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్, ఏపీఆర్ హోమ్స్, కృషి డిఫెన్స్ కాలనీ, నిజామియా దర్గా లో నిర్వహించిన హరితహారం లో చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెల్ల గూడెం మహిపాల్ రెడ్డి లో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, స్థానిక కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అద్యక్షులు అఫ్జల్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.

పటాన్చెరు మండలం లో..
పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామం పి ఎన్ ఆర్ టౌన్షిప్లులో నిర్వహించిన హరితహారం లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, స్థానిక సర్పంచ్ నర్సింలు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.