గీతంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026

Telangana

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తిపరమైన సలహాల విభాగం (టీఎంసీజీ), ప్రత్యామ్నాయ వృత్తి సేవల విభాగం ఆధ్వర్యంలో బుధవారం గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ ను నిర్వహించింది. విదేశాలలో శరదృతువు (ఫాల్) 2027లో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం చేపట్టే అడ్మిషన్ల ప్రక్రియపై సంపూర్ణ అవగాహనను కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు.

ఈ ఫెయిర్ లో ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, సింగపూర్, స్విట్జర్లాండ్, యూకే, యూఎస్ చెందిన పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులకు మాస్టర్స్ ప్రోగ్రామ్ వివరాలను తెలుసుకోవడానికి, ప్రవేశ ప్రక్రియను అర్థంచేసుకోవడానికి, స్కాలర్ షిప్పులు, ఆర్థిక సహాయం, దరఖాస్తు విధానాలపై అవగాహన పొందడానికి ఇది వీలు కల్పించింది.ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో విద్యార్థులు ముఖాముఖి సంభాషించి, ఆయా కోర్సులలో చేరడానికి తగిన మార్గదర్శనంతో పాటు ఫీజు మినహాయింపు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రెజా, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ సమక్షంలో ప్రారంభించారు. టీఎంసీజీ మేనేజర్ ఎస్. సఫా దీనిని సమన్వయం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *