గర్భిణీలు అధిక పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి

politics Telangana

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

గర్భిణీలు,బాలింతలు అధిక పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని భానూర్ సర్పంచ్ శాంతయ్య, ఉప సర్పంచ్ లతా రెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ జయలక్ష్మి అన్నారు.అంగన్వాడీ పోషణ మాసం పురస్కరించుకొని మంగళవారం పటాన్ చెరు మండలంలోని బానూర్ లో అంగన్వాడి కేంద్రం -1 లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శ్రీమంతం, అన్న ప్రసన్నం, అక్షరాభ్యాసం తో పాటు అంగన్వాడి లో అందించే పోషక ఆహార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని గర్భిణీలు, బాలింతలు తీసుకోవటంతో పాటు అంగన్వాడీలో అందిస్తున్న ఆరోగ్య లక్ష్మి, ఒక పూట భోజనం పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు, తగ్గిన వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ఆస్పత్రికి వెళ్లాలని, ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించాలని తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి రవీందర్, పాపయ్య, గోపాల్, శ్రీనివాస్, అంగన్వాడి టీచర్లు విఠలమ్మ, మంజుల, బాలింతలు, గర్భిణీలు, తల్లులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *