పటాన్ చెరు
ముస్లింలు ఏడాదిలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ ఒకటి. త్యాగాల పండుగగా పేరున్న బక్రీద్ రోజు ఉదయమే నిద్రలేచి, ప్రత్యేక ప్రార్ధనలు పూర్తి చేసుకుని ,ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారని అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని బుదవారం పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఆధునీకరించిన మదీనా మసీదును సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మదీనా మసీదు స్థానిక ముస్లిం సోదరులు తమ సొంత నిధులతో ఎంతో గొప్పగా జిల్లాలోనే అద్భుతమైన మసీదును నిర్మించుకున్నారని అభినందించారు పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని, సోదర భావాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ ముస్లిం సోదరులు ఈ పండుగ జరుపుకుంటురని , ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటరని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మసీదు కమిటీ ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.