పటాన్ చెరు
త్యాగాన్ని క్షమను గుర్తు చేస్తూ, స్వార్థాన్ని త్యజించాలన్నదే, బక్రీద్ మనకు ఇచ్చే సందేశం. శాంతి, సామరస్యాలతో సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ బక్రీద్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం రోజున బక్రీద్ పండుగ సందర్బంగా పటాన్ చెరు లోనీ ఈద్గాలోని ముస్లిం సహోదరులు ఎంతో భక్తిభావంతో జరుపుకునే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ప్రార్థనా స్థలాలలో పారిశుధ్య పనులను శుభ్రం చేయించారు కుల మతాలకు అతీతంగా అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ వారి పండుగలను ఆనందంగా జరుపుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు.గత ఏడాది కోవిడ్ కారణంగా బక్రీద్ పండుగను జరుపుకోలేదని ,ఈ సారి కొవిడ్ నిబంధనలతో బక్రీద్‌ను పండుగను నిర్వహించుకోవాలని ,ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ ,మాస్క్ ధరించాలని ఎవరికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు.