పటాన్ చెరు
పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీ లో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను సోమవారం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించ తలపెట్టిన చర్చి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ శుద్ధి చేసిన నీటిని మాత్రమే ప్రతి ఒక్కరూ వినియోగించాలని తద్వారా వ్యాధులను అరికట్టవచ్చని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిఇంటికి నీరు అందించారని తెలిపారు
వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులం మతం వర్గం తేడాలేకుండా అన్ని ప్రధాన పండుగలను సంబురంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నీలం మధు, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, కొత్త గొల్ల మల్లేష్ యాదవ్ , స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు