అమీన్పూర్
దుర్గా నగర్ కాలనీ లో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని దుర్గ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఏర్పుల కృష్ణ. పంచాయతీ కార్యదర్శి వెంకట్ లకు ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మండలంలోని కిష్టారెడ్డిపేట దుర్గా నగర్ కాలనీ లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ ద్వీపాలు సరిగ్గా లేకపోవడం.కాలనీ ప్రజలందరికీ ఇబ్బందికరంగా మారిందన్నారు. అలాగే వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు రోడ్ల వెంబడి గుంతల్లో నీళ్లు నిలిచి పోతున్నాయని నిలిచిపోయిన నీళ్లు బయటకు వెళ్లడానికి కూడా వీలులేకుండా ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో సైతం కాలనీకి ఎవరు వచ్చి, ఏమీ చేయలేదని వాపోయారు.పంచాయతీ పాలకవర్గం. కార్యదర్శి స్పందించి కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుదుర్గ ప్రసాద్. సత్యం. రవీందర్ రెడ్డి. దిలీప్ కుమార్. రాకేష్. సంతోష్ కుమార్. శ్రావణ్ లతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.