క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

Hyderabad Telangana

పటాన్‌చెరు:

చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తల్లిదండ్రులు నీలం రాధమ్మ, నిర్మల్ గత కొన్ని రోజుల క్రితం మరణించారు. వారి జ్ఞాపకార్థంగా సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా అమీన్ పూర్ మండల పరిధిలోని నర్రేగూడెం గ్రామంలో స్వర్గీయ నీలం రాధమ్మ, నిర్మల్ ల జ్ఞాపకార్థంగా క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించారు. వారం రోజుల పాటు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.20 వేలు, రెండవ బహుమతి రూ.10 వేలు, మూడవ బహుమతి రూ.5 వేలు బహుమానంగా అందజేస్తామని వారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *