పటాన్ చెరు:
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని,గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి లు అన్నారు.
పటన్ చెరు మండల పరిధిలోని బచ్చు గూడెం,ఇంద్రేశం, రామేశ్వరంబండ గ్రామాల సర్పంచులతో మొక్కలు నాటారు.గ్రామాలలో నిర్వహించిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీపీ లు విచ్చేసి గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు అందరూ కలిసి మెలిసి ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.
రానున్న వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. లేని ఎడల అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా హరితహారం లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మనం అందరం ఇప్పుడు మొక్కలు నాటితే భావితరాలకు మంచి వాతావరణం అందించిన వాళ్ళము అవుతామని పేర్కొన్నారు. చెట్లు పెరిగితే వర్షాలు కూడా బాగా పడతాయని చెప్పారు. లక్డారం గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ఆయా గ్రామ సర్పంచ్ లను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు అంతిరెడ్డిగారి ధరణి అంతిరెడ్డి,దండు నర్సింహా,ఒగ్గు సుమతి రాంచందర్, ఉప సర్పంచులు శివ కుమార్ గౌడ్,జంగారెడ్డి, నాగేశ్,ఎంపీడీఓ బన్సీలాల్, స్పెషల్ ఆఫీసర్ సతీష్, రామేశ్వరంబండ ఎంపీటీసీ మాణెమ్మ,ఈఓలు భవానీ, సుభాష్,వార్డు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.