సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

politics Telangana

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు.శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎం.ఐ.జి కాలనీలో గల సీనియర్ సిటిజన్స్ భవన్‌లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ , రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా వెనుకబడిన 241 మంది భేల్ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. సీనియర్ సిటిజన్స్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ తమవంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.అలాగే సీనియర్ సిటిజన్స్ భవన్ సమీపంలో కల్వర్ట్ మరియు సీసీ రోడ్డు నిర్మాణానికి కొత్త ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు వైకుంఠ రావు, జనరల్ సెక్రటరీ రామ రావు, అలాగే వెంకట్ రెడ్డి, దేవేంద్ర చారీ, రాధాకృష్ణ, మోహన్, బ్రహ్మయ్య, రాజు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *