జగదీశ్వర్ గౌడ్, బండి రమేష్‌లతో యలమంచి ఉదయ్ కిరణ్ కీలక భేటీ
మనవార్తలు ప్రతినిధి, మియాపూర్ :
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టంగా నిలబెట్టే లక్ష్యంతో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు & చైర్మన్ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ తన బృందంతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ , టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ జగదీశ్వర్ గౌడ్ ని, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బండి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ భేటీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణకు, పార్టీ బలోపేతానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. పార్టీ పట్ల వారి అంకితభావం, అనుభవజ్ఞులైన నాయకత్వాన్ని గౌరవిస్తూ శ్రీ జగదీశ్వర్ గౌడ్ ని, శ్రీ బండి రమేష్ ని సంప్రదాయ శాలువాలతో ఘనంగా సత్కరించి, పర్యావరణ పరిరక్షణకు నిదర్శనంగా మొక్కలను అందజేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, పర్యావరణ బాధ్యత, విలువల రాజకీయాలకు నిదర్శనంగా నిలిచింది.ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్న ప్రత్యర్థి రాజకీయాలకు ఎదురొడ్డి నిలబడే శక్తి కాంగ్రెస్‌కే ఉందని స్పష్టంగా చాటారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోకినేపల్లి రమేష్, రత్నాచారి, ప్రసాద్, గురువులు, వాసు తదితరులు పాల్గొన్నారు.

