పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పట్నం విందు రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్ డీ ఆర్ ఫౌండేషన్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహారంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. రుచికరమైన వంటకాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో రెస్టారెంట్ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే వ్యాపార రంగంలో ముందుకు వస్తున్న యువకులు సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందిస్తూ, ఇలాంటి నూతన వ్యాపారాలు పటాన్‌చెరు పట్టణ అభివృద్ధికి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో దోహదపడాలని ఆకాంక్షించారు.
