ఎస్ జి ఎఫ్ అండర్ 17 పోటీలకు ఎన్నికైన జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థి కి అభినందనలు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

ఈ నెల 25 నుండి 27 వరకు కరీంనగర్‌లో జరిగిన 69వ ఎస్ జి ఎఫ్ అండర్-17 బాలుర రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు 9 వ తరగతి ఎఫ్ సెక్షన్ కు చెందిన చరణ్‌కు హృదయపూర్వక అభినందనలు.తెలుపుతున్నట్లు జ్యోతి విద్యాలయ హై స్కూల్ కరస్పాండెంట్, ఫాదర్ అంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, టీచర్లు కోచ్ తెలిపారు. ఈ పోటీల్లో 10 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొనడంతో మెదక్ జిల్లాకు 3వ స్థానం సాధించడం ప్రశంసనీయమైన విజయమని కొనియాడారు. అంకితభావం, క్రమశిక్షణ మరియు పోటీ స్ఫూర్తి అని ప్రాబబుల్స్ క్యాంప్‌కు అర్హత సాధించిన అవకాశాన్ని కల్పించాయనీ,.ఇది మా పాఠశాల మరియు క్రీడా విభాగానికి గర్వకారణమన్నారు. జట్టు ఈ మైలురాయిని చేరుకోవడానికి సహాయపడిన అద్భుతమైన మార్గదర్శకత్వం, సాంకేతిక మద్దతు మరియు ప్రేరణ కోసం మెదక్ జిల్లా కోచ్ వేణు గోపాల్ కు ప్రత్యేక ప్రశంసలు.అందజేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *