పోలీసుల సేవలు మరువలేనివి – కృష్ణ మూర్తి చారి

politics Telangana

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :

పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు. పటాన్ చెరు పోలీస్ డిపార్ట్ మెంట్ లో 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా, సంగారెడ్డి సిఐ రమేష్, ఆదిలాబాద్ ఏఎస్ఐ భూమన్న జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అర్జున్ ,హైదరాబాద్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్,కర్నూల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బషీర్, వరంగల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్  శ్రీనివాస్, సిద్దిపేట్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రవి రాజు, నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వాటర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి, కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జీవన్ కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సంతోష్, ఆంధ్రప్రదేశ్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, నిజామాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దేవదాస్, ధర్మ గౌడ్ లను, కలిసిన శుభ సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి పోలీసు మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేసారు. ఈ సందర్భంగా 30 సంవత్సరాలుగా వారు పోలీస్ శాఖకు చేసిన కృషికి మరియు ప్రజాసేవను గుర్తుచేసి వారు వారి సర్వీసులో మరెన్నో ఉన్నత పదవులకు చేరుకోవాలని కోరుకున్నారు, ఈ కార్యక్రమంలో అఫ్జల్, సాయి వెంకట హర్ష, సన్నీ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *