జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం యలమంచి ఉదయ్ కిరణ్

politics Telangana

శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌లు జ‌రుగుతున్న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్ గా మారింది.హైద‌రాబాద్ జిల్లా ప‌రిధిలోని జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్య నేత‌లు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా యూసుఫ్‌గూడ డివిజన్‌ నాగార్జున నగర్ కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు . యలమంచి ఉదయ్ కిరణ్ ఆయన బృందం ఇంటింటికి వెళ్లి, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా సేవా తపన, సమాన అభివృద్ధి పట్ల అంకితభావం, పారదర్శక పాలనపై ప్రజలకు అవగాహన కల్పించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మద్దతు ఇవ్వాలనే పిలుపునిచ్చారు. ప్రజలు ఉత్సాహంగా స్పందించి, కాంగ్రెస్ పార్టీపై తమ విశ్వాసాన్ని మరోసారి వ్యక్తపరిచారు.

ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రజల విశ్వాసం కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న ఆదరణకు ప్రతిబింబంగా నిలిచింది, తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా ప్రజల మద్దతు మరింత బలపడింది.యూసుఫ్‌గూడ డివిజన్‌ ,నాగార్జున నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారంలో యలమంచి ఉదయ్ కిరణ్ మరియు బృందం పాల్గొన్నారు. న‌వంబ‌ర్ 11 న జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గ‌నున్న పోలింగ్ లో అత్య‌ధిక శాతం ఓట్లు పోల‌య్యేలా త‌మ బృందం ప్ర‌చారం చేస్తుంద‌ని య‌ల‌మంచి ఉద‌య్ కిర‌ణ్ తెలిపారు. కొత్తగా ఓటు వ‌చ్చిన యువ‌త త‌మ ఓటును సద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. హైద‌రాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం త‌గ్గిపోతుండ‌టంతో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్ర‌చారంలో భాగంగా ఓటర్ల‌ను చైత‌న్యం చేస్తున్నామ‌న్నారు.

ఈ కార్యక్రమంలో బొడ్డు రవిశంకర్,గంగవరపు శ్రీ రామకృష్ణ ప్రసాద్,రావిపాటి వెంకటేశ్వర్లు,వాసిరెడ్డి శ్వేత,చిలుకూరి అనిత,యలమంచిలి వెంకట కృష్ణారావు,మందడి కోటేశ్వర రావు,బండ్ల రవీంద్ర బాబు,కొల్లి అనిల్ కుమార్,ఇరుకులపాటి నరసింహారావు,వేంకటేశ్వర రావు,కామినేని శ్రీనివాసు,వంశీ కృష్ణా,సతీష్,నాగ సాయి,రత్న చారి,శ్రీహరి మరియు లోకల్ నాయకులు తదితరులతో కలిసి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌ల‌ను విని ప‌రిష్క‌రించేందుకు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని హామి ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *