సమీకృత కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆధునిక వసతులతో సమీకృత భవనం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు డివిజన్ పరిధిలోని బ్లాక్ ఆఫీస్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సమీకృత కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఉదయం పటాన్చెరువు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల సౌజన్యంతో భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడంలో భాగంగా నీటిపారుదల, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, అంగన్వాడి భాగాలకు చెందిన నియోజకవర్గ స్థాయి కార్యాలయాలు అన్నింటిని ఒకే భవనంలో కార్యకలాపాలు నిర్వహించేలా భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. నియోజకవర్గ స్థాయిలోని ప్రభుత్వ విభాగాలన్నింటికీ శాశ్వత ప్రాతిపదికన ఆధునిక వసతులతో భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు సంపూర్ణ సహకారం అందించిన ఆదిత్రి యాజమాన్యం నాగేశ్వరరావు, సురేష్ లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, ఆదిత్రి కన్స్ట్రక్షన్స్ ఎండి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బండి శంకర్, పరమేష్ యాదవ్, అధికారులు భీం, సురేష్, శ్రీనివాస్, యాదగిరి, రంగారావు, జయరాం నాయక్, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

 
	 
						 
						