పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు.కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని బాపూజీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మూడు తరాలపాటు అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు. జాతికి వారు చేసిన సేవలను భవిష్యత్తు తరాలకు అందించాలన్న సమన్నత లక్ష్యంతో పటాన్చెరులో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన అదృష్టం తనకు దక్కిందన్నారు. బాపూజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.