పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు నియోజకవర్గంలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో ఈ ఏడాది హుండీ ఆదాయం పెరిగింది. వినాయక చవితి బ్రహ్మోత్సవాల సందర్భంగా 78 రోజుల హుండీ ఆదాయం 25 లక్షల 61 వేల 569 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు . హుండీ ఆదాయంలో భాగంగా స్వామివారి హుండీ ద్వారా 24 లక్షల 46 వేల 712 రూపాయలు, అన్నదానం హుండీలో లక్ష 14 వేల857 రూపాయలు భక్తులు సమర్పించుకున్నట్లు ఆలయ ఈవో లావణ్య తెలిపారు .ఇస్నాపూర్ మున్సిపాలిటీ రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతయ్యగా స్వయంభుగా వెలసిన స్వామి భక్తులకు కొంగుబంగారమై కోరిన కోరికలను నెరవేరుస్తూ నిరంతరం పూజలు అందుకుంటున్నారని ఈవో లావణ్య తెలిపారు. భక్తులకు నమ్మకంతో కుటుంబ సభ్యులతో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి భక్తునికి సిద్ధి గణపతి స్వామి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె తెలిపారు
ఈ కార్యక్రమంలో ఛైర్మన్ హరిప్రసాద్ రెడ్డి , దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ , ధర్మకర్తల మండలి సభ్యులు నరసింహ గౌడ్, నాగరాజు గౌడ్, నరసింహులు, కృష్ణవేణి, నరసింహారెడ్డితో పాటు సేవా సమితి సభ్యులు, అర్చకులు,రుద్రారం గ్రామ పెద్దలు ,భక్తులు పాల్గొన్నారు .