పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నేడు సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని ఆలయం భక్తులతో కిటకిట లాడింది సిద్ధిగణపతి సింధూర వర్ణం లో భక్తులకు దర్శనమిచ్చిడు .ఉదయం నుండి విశేష పంచామృత అభిషేకము ,ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని సిద్ధి గణపతి ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని , సంకష్టహర చతుర్దశి రోజున గణనాధుని వ్రతం చేయడం వల్ల అన్ని విజయాలు కలుగుతాయని తెలిపారు . సిద్ది గణపతి స్వామివారి వ్రతం మరియు అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో లావణ్య ,ఆలయ ధర్మకర్తలు కృష్ణవేణి ,జూనియర్ అసిస్టెంట్లు ఈశ్వర్,సోమేశ్వర్ ,ఆలయ అర్చకులు అజయ్ ,సంతోష్ శర్మ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు.