ఘనంగా ముగిసిన రుద్రారం సిద్ధి గణపతి వార్షిక బ్రహ్మోత్సవాలు

politics Telangana

రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గ్రామంలో గల ప్రసిద్ధ శ్రీ సిద్ధి గణపతి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజు, ఆలయ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి, ఈవో లావణ్య , ఆలయ కమిటీ డైరెక్టర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *